వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ రెండో ఎస్సార్సీ పరిధిలోకి రాదు: రషీద్ అల్వీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Rashid Alvi
న్యూఢిల్లీ: తెలంగాణ నాయకులకు తాత్కాలికంగా ఊరట కలిగించే ప్రకటన కాంగ్రెసు అధిష్టానం నుంచి వెలువడింది. తెలంగాణ అంశం ప్రత్యేకమైందని, అది రెండో ఎస్సార్సీ పరిధిలోకి రాదని ఎఐసిసి అధికార ప్రతినిధి రషీద్ అల్వీ శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. రాష్ట్రాల విభజనపై రెండో ఎస్సార్సీయే తమ పార్టీ విధానమని, తెలంగాణపై కూడా రెండో ఎస్సార్సీ అయితేనే మంచిదని తమ అభిప్రాయమని ఇటీవల ప్రకటన చేసిన రషీద్ అల్వీయే శుక్రవారం అందుకు భిన్నమైన ప్రకటన చేశారు. తమ పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు ప్రతిస్పందనలను గమనించిన తర్వాత కాంగ్రెసు అధిష్టానం పెద్దలే అల్వీ చేత శుక్రవారం ఈ ప్రకటన చేయించారని భావిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ విభజన, ఇతర చిన్న రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లపై రెండో ఎస్సార్సీ వేయాలనేదే తమ పార్టీ విధానమని, తెలంగాణ అంశాన్ని మాత్రం ఎస్సార్సీతో ముడిపెట్టలేమని అల్వీ అన్నారు. యుపి విభజనను ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి రాజకీయ జిమ్మిక్కుతో ముందుకు తెచ్చారని ఆయన విమర్శించారు. ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో రాష్ట్రాభివృద్ధిని కాకుండా విభజన అంశాన్ని ముందుకు తెచ్చి రాజకీయం చేయడం, దాన్ని ఎన్నికల ఎజెండాగా మార్చడం సరైంది కాదని ఆయన అన్నారు. భాష, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ఇందుకు రెండో ఎస్సార్సీ వేసి అధ్యయనం చేయించడం అవసరమని ఆయన అన్నారు.

English summary
AICC spokesperson Rashid Alvi said that Telangana will not come under the purview od second SRC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X