విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గిన్నిస్ ప్రపంచ రికార్డులకు ఎక్కిన విశాఖ లడ్డు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ganesh Laddu
విశాఖపట్నం: రాష్ట్రంలోని విశాఖపట్నానికి చెందిన గణేష ఉత్సవాల లడ్డు గిన్నిస్ ప్రపంచ రికార్డులకు ఎక్కింది. అది 5,570 కిలోల బరువు ఉంది. తపేశ్వరంలో సువర్ణభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ లడ్డును తయారు చేసింది. రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతినిధి సతీష్ రెడ్డి గిన్నిస్ నుంచి అందుకున్న సర్టిఫికెట్‌ను విశాఖపట్నంలో మీడియా ప్రతినిధులకు చూపించారు. విశాఖపట్నంలో వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ నెలకొల్పిన వినాయక విగ్రహం వద్ద ఈ లడ్డును పెట్టారు. ఈ ఏడాది అదే అత్యంత పొడవైన వినాయక విగ్రహం కావడం విశేషం.

లడ్డును తయారు చేయడానికి వారం పాటు 50 మంది శ్రమించారు. అతి పెద్ద బరువు ఉన్న లడ్డుగా ఇప్పటి వరకు బ్రిటన్‌లోని హిందూ ఆలయంలో తయారు చేసిన 551 కిలోల లడ్డు రికార్డులకు ఎక్కింది. ఆ రికార్డును విశాఖపట్నం లడ్డు బద్దలు కొట్టింది. హైదరాబాదులోని ఖైరతాబాద్ వినాయక విగ్రహం కోసం తపేశ్వరానికి చెందిన ఓ స్వీట్ షాపు 450 కిలోల లడ్డును తయారు చేసింది. ఖైరతాబాద్ విగ్రహం 55 అడుగుల పొడవు ఉంది. ఈ ఏడాది విశాఖపట్నం విగ్రహం ఈ విగ్రహాన్ని మించి పెరిగింది.

English summary
A huge 5,570 KG laddu prepared for recent Ganesh festival in Vishakha has entered the Guinness world records.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X