• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పెళ్లి చేసుకోవాలనుకుంటున్న యోగా గురు రామ్‌దేవ్

By Pratap
|

Yoga Guru Baba Ramdev
లక్నో: యోగా గురు రామ్‌దేవ్ బాబా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని హాయిగా కాలం గడపాలోయ్ అనే రాగం అందుకున్నారు. బ్రహ్మచర్యం వదిలేసి దాంపత్య జీవితం గడపాలని ఆయన వాంఛిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇతరుల మాదిరిగానే తాను పెళ్లి చేసుకుని తనకు కూడా ఓ కుటుంబం కావాలని ఉందని ఆయన అన్నారు. అలహాబాద్ జిల్లాలోని ఓ కార్యక్రమంలో యోగా శిక్షణ ఇస్తూ తన మనసులోని మాటను వెల్లడించారు.

ఆయన పెళ్లి ప్రకటన చేయగానే రాఖీ సావంత్ ప్రకటన గుర్తుకు వస్తుంది. తాము రామ్‌దేవ్ బాబాను పెళ్లి చేసుకుంటానని రాఖీ సావంత్ ప్రకటించింది. ఆ ప్రకటనపై అప్పట్లో రామ్‌దేవ్ బాబా తీవ్రంగా ప్రతిస్పందించలేదు. రామ్‌దేవ్ బాబా అవినీతి ఎజెండాతో కాంగ్రెసుపై పోరాటానికి దిగారు. విపరీతమైన సందడే చేశారు. తాను రాజకీయ పార్టీని స్థాపించదలుచుకున్నట్లు కూడా ఆయన గతంలో చెప్పారు. అది ఇప్పటి వరకు సాకారం కాలేదు.

English summary
Yoga Guru Ramdev Baba wants to marry and wants to live like others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X