India
  • search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీలక్ష్మి విచారణను తొందరగా ముగించిన సిబిఐ

By Pratap
|
Google Oneindia TeluguNews
Sri Lakshmi
హైదరాబాద్: గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమాల కేసులో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి విచారణను సిబిఐ అధికారులు శనివారం చాలా తొందరగా ముగించారు. ఆమెను కేవలం గంటన్నర సేపు విచారించి, పంపించారు. సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ అందుబాటులో లేకపోవడం వల్లనే ఆమె విచారణ తొందరగా ముగిసినట్లు భావిస్తున్నారు. పైగా, ఆమె సిబిఐ అధికారులకు మెడికల్ సర్టిఫికెట్ సమర్పించారు. తన ఆరోగ్యం సరిగా లేదంటూ ఆమె ఆ సర్టిఫికెట్‌ను సిబిఐకి సమర్పించారు. నిజానికి, ఆమె శుక్రవారం మరోసారి సిబిఐ ముందు హాజరు కావాల్సింది. అయితే, లక్ష్మినారాయణ అందుబాటులో లేకపోవడంతో శనివారం వచ్చారు.

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమాల కేసులో సీనియర్ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి మరోసారి శనివారం ఉదయం హాజరయ్యారు. కాగా, గాలి జనార్దన్ రెడ్డి కేసులో నాలుగో నిందితురాలైన శ్రీలక్ష్మి అరెస్టుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇటీవల సిబిఐ తొమ్మిది గంటల పాటు శ్రీలక్ష్మిని ప్రశ్నించింది. ఆ రోజే ఆమెను సిబిఐ అరెస్టు చేస్తుందని భావించారు. కానీ అది జరగలేదు. తాను అరెస్టు కాకుండా శ్రీలక్ష్మి తీవ్ర ప్రయత్నాలే చేశారని ప్రచారం జరుగుతోంది. కేసులో అప్రూవర్‌గా మారుతానని ఆమె చెప్పారని వార్తలు వస్తున్నాయి. శ్రీలక్ష్మికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు మాట్లాడని మరో ఐఎఎస్ అధికారి రాజగోపాల్ శుక్రవారం తప్పునంతా ఆమెపైనే వేసినట్లు వార్తలు వచ్చాయి.

ఢిల్లీ నుంచి ఒత్తిళ్లు రావడం వల్లనే సిబిఐ ఆమె అరెస్టుపై ఇటీవల వెనక్కి తగ్గినట్లు ఓ వార్తాపత్రిక రాసింది. దాంతో పాటు శ్రీలక్ష్మిని అరెస్టు చేయడం కన్నా అప్రూవర్‌గా మార్చుకుంటే పెద్దల గుట్టు బయటపడుతుందని సిబిఐ ఆలోచనగా చెబుతున్నారు. బ్రాహ్మణి స్టీల్స్‌కు కాప్టివ్ మైన్‌గా ఖనిజాలను వాడాలనే పదం ఏ దశలో జీవో నుంచి మాయమైందో తనకు తెలియదని ఆమె అంటున్నారు. బ్రాహ్మణి స్టీల్స్‌కు కాప్టివ్ మైన్‌గా వాడడానికి అప్పటి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఓబుళాపురం గనులను గాలి జనార్దన్ రెడ్డికి ఇచ్చింది. అయితే, జీవోలో ఆ పదం మాయం కావడంతో గాలి జనార్దన్ రెడ్డి ఇనుప ఖనిజాన్ని యధేచ్ఛగా ఎగుమతి చేశారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్ల కారణంగానే గాలి జనార్దన్ రెడ్డికి గనులను లీజుకు ఇవ్వాల్సి వచ్చిందని కూడా శ్రీలక్ష్మి సిబిఐ ముందు చెప్పినట్లు తెలుస్తోంది.

English summary
Senior IAS officer Srilakshmi has attended before CBI second time in gali Janardhan Reddy's case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X