హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాజీ టెలికం మంత్రి సుఖ్‌రామ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష

By Pratap
|
Google Oneindia TeluguNews

Sukhram
హైదరాబాద్: పదిహేనేళ్ల నాటి టెలికం కుంభకోణం కేసులో టెలికం శాఖ మాజీ మంత్రి సుఖ్‌రామ్‌కు ప్రత్యేక కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, 4 లక్షల రూపాయల జరిమానా విధించింది. సుఖ్‌రామ్ మూడు లక్షల రూపాయల లంచం తీసుకున్నాడనే ఆరోపణపై ఈ కేసు నమోదైంది. ఆయనకు గరిష్ట శిక్ష విధించాలని తీర్పు వెలువడడానికి ముందు సిబిఐ కోర్టును కోరింది. తన వయస్సును దృష్టిలో పెట్టుకుని తక్కువ శిక్ష విధించాలని 86 ఏళ్ల సుఖ్‌రామ్ కోర్టుకు విన్నవించుకున్నారు. 1996లో పివి నరసింహారావు మంత్రివర్గంలో ఆయన టెలికం మంత్రిగా పనిచేశారు.

పివి నరసింహారావు ప్రభుత్వంలో టెలికం మంత్రిగా పనిచేసిన సుఖ్‌రామ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, 30 కోట్ల రూపాయల విలువ చేసే కాంట్రాక్టును ప్రైవేట్ సంస్థ హర్యానా టెలికం కంపెనీకి ఇచ్చారని సిబిఐ అభియోగం మోపింది. ఈ కేసులో సుఖ్‌రామ్‌ను కోర్టు గురువారం దోషిగా నిర్ధారించింది. శనివారం సుఖ్‌రామ్‌కు ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు.

English summary
Former Telecom Minister Sukhram, convicted for taking Rs 3 lakhs as bribe to give a lucrative contract to a private firm in 1996, was on Saturday sentenced to five years in jail by a Delhi court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X