వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయ రంగ ప్రవేశంపై నో కామెంట్ అన్న బాలయ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

balakrishna
రాజమండ్రి: తన రాజకీయ రంగ ప్రవేశంపై హీరో నందమూరి బాలకృష్ణం శనివారం ఏమీ మాట్లాడలేదు. బాలకృష్ణ, మంచు మనోజ్, దీక్షా సేథ్ తదితరులు నటిస్తున్న ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా చిత్రం షూటింగు పశ్చిమ గోదావరి జిల్లాలోని బ్రాహ్మణ చెరువు శివారులో జరిగింది. ఈ సందర్భంగా ఆయన రాజమండ్రికి వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభిరుచిగల నిర్మాతలు ముందుకు వస్తే తాను మరిన్ని పౌరాణిక చిత్రాల్లో నటిస్తానని చెప్పారు. శ్రీరామరాజ్యం చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు.

ఈ సందర్భంగా మీరు రాజకీయాల్లోకి వస్తారా అని విలేకరులు ప్రశ్నించగా నో కామెంట్స్ అన్నారు. శ్రీరామరాజ్యం సూపర్ హిట్ కావడంతో ఆ ఆనందంలో ఉన్న బాలయ్య ఇప్పటికిప్పుడు రాజకీయాలు మాట్లాడటానికి ఇష్టపడటం లేదేమే! కాగా బ్రాహ్మణ చెరువు శివారులో షూటింగ్ జరుగుతున్న సమయంలో పెద్ద ఎత్తున అక్కడకు వచ్చిన అభిమానులు కాబోయే ముఖ్యమంత్రి బాలయ్య జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.

English summary
Hero Balakrishna said on saturday that no comments on his political entry. He participated in Ulikki Padatara Ookodatara film shooting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X