ఎందుకొచ్చారు, ఎందుకెళ్లారు?: జయసుధకు రోజా ప్రశ్న

Roja
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఉన్నతమైందని ఆ పార్టీ నేత రోజా ఆదివారం కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చలువతో పదవులు పొందిన వారు ఇప్పుడు తనను, తన తండ్రిని విమర్శిస్తున్నప్పటికీ జగన్ ఏమీ అనకుండా ఉంటున్నారని అదే ఆయన ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. కాంగ్రెసు నేతలు జగన్‌ను విమర్శించడాన్ని ఆమె తప్పుపట్టారు.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్తులపై వచ్చిన ఆరోపణలు నిజమేనని ఆమె చెప్పారు. చంద్రబాబును కాపాడుకోవడానికే టిడిపి నేతలు కాలు కాలిన పిల్లి వలె తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజాలు లేవు కాబట్టే జగన్ సిబిఐ విచారణకు హాజరవుతున్నారన్నారు. పలువురు ఎమ్మెల్యేలు జగన్ నుండి దూరమవుతున్నారన్న వార్తలు కేవలం మీడియా కథనాలేనని ఆమె కొట్టి పారేశారు.

గతంలో వైయస్ పథకాలు నచ్చాయన్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పథకాలు బాగున్నాయడం వెనుక ఉద్దేశ్యమేమిటో చెప్పాలన్నారు. జయసుధ జగన్ పార్టీలోకి ఎందుకు వచ్చారో ఎందుకు వెళుతున్నారో వివరించాలని ప్రశ్నించారు. మధ్యంతర ఎన్నికలు వస్తాయనుకుంటే తాము అవిశ్వాసానికి మద్దతిస్తామన్నారు. తమకు ప్రజల మద్దతుందని ఎమ్మెల్యేలు, ఎంపీలతో పని లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+