• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

గచ్చిబౌలిలో సాఫ్టువేర్ ఉద్యోగిని ఆత్మహత్య

By Srinivas
|

Hyderabad(Charminar)
హైదరాబాద్: ఓ సాఫ్టువేర్ ఉద్యోగిని హైదరాబాదులోని గచ్చిబౌలిలో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. వినాయకనగర్‌లో నివాసం ఉంటున్న సింధూర అనే ఉద్యోగిని గచ్చిబౌలిలో ఓ సాఫ్టువేర్ కంపెనీలో పని చేస్తోంది. ఆమె గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వ్యక్తి. ఆమెకు ఇటీవలే తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన మణికంఠకుమార్‌తో వివాహం అయింది.

వారు హైదరాబాదులోని వినాయకనగర్‌లో కొత్తగా కాపురం పెట్టారు. ప్రస్తుతం సింధూర తల్లిదండ్రులు కూడా ఆమె వద్దే ఉంటున్నారు. ఆదివారం ఉదయం ఆమె తల్లిదండ్రులు సింధూర గదిలోకి వెళ్లి చూసేసరికి సింధూర ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించింది. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

English summary
Woman software employee committed to suicide today at Gachibowli in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X