వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్ రాకెట్ నడుపుతున్న టివి ఆర్టిస్ట్, ఏజెంట్ అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Prostitution
పూణే: నగరంలోని రైల్వే స్టేషన్ పరిసర ఓ హోటల్ నుండి వ్యభిచార రాకెట్ నడుపుతున్న ఓ టివి యాక్టర్‌ను క్రైం బ్రాంచ్‌కు చెందిన సోషల్ సెక్యూరిటీ సెల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇరవయ్యొక్క సంవత్సరాలున్న సదరు టివి యాక్టర్ జమ్ము-కాశ్మీర్ నుండి వచ్చి ముంబయిలో ఉంటుంది. ఓ ఏజెంట్‌ను పెట్టుకొని ఆమె సెక్స్ రాకెట్ నడుపుతోంది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసు అధికారులు వల వేసి వారిని పట్టుకున్నారు. సదరు టివి యాక్టర్, ఇరవయ్యేడేళ్ల ఏజెంట్ కలిసి సెక్స్ రాకెట్ నడుపుతున్నారని నిర్ధారించుకున్న తర్వాత వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఆమె హిందీ టెలివిజన్ సీరియల్లలో చిన్న పాత్రలు పోషిస్తోంది. ఆమె ఏజెంట్ టివి సీరియల్స్‌కి స్పాట్ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఆమె ముంబయిలో ఉంటూనే పూణేలో తన రాకెట్‌ను ఏజెంట్ ద్వారా నడిపిస్తోంది. నిందితుల పైన పోలీసులు కేసు నమోదు చేసి బంద్ గార్డెన్ పోలీసు స్టేషన్‌కు బదలీ చేశారు. టివి యాక్టర్, ఏజెంటును ఆదివారం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశ పెట్టారు.

English summary
A small-time TV actress and a man were arrested by the social security cell of the crime branch on Saturday evening for allegedly running a prostitution racket from a hotel near Pune railway station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X