గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ధైర్యంగా చెప్పేందుకే రూపొందించారు: వైయస్ జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు: ప్రభుత్వం గ్రామాల దాకా వెళ్లి పల్లెల్లో నిల్చుని ధైర్యంగా సమస్యలు చెప్పమని ప్రజలను అడగాలన్న స్వప్నంతో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని రూపొందించారని కానీ ఈ కాంగ్రెసు ప్రభుత్వం మాత్రం ప్రజల గుండె చప్పుడు వినకుండానే రచ్చబండను కేవలం మండల కేంద్రాలకు పరిమితం చేస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం తన ఓదార్పు యాత్రలో విమర్శించారు. ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామాల్లోకి వెళ్లాలని సూచించారు. కొద్దొ గొప్పో ఇవ్వాలనుకున్నవి మండల కేంద్రంలోనే ఏర్పాటు చేసి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. పేదలకు రెండు వేల ఇళ్లు ఎమ్మెల్యేలు చెప్పిన వారికే ఇస్తారట ఇది ప్రజలను మోసం చేసేందుకే అని ధ్వజమెత్తారు.

రాష్ట్ర చరిత్రలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెసు కుమ్మక్కై నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. ఈ రెండు రాజకీయ పార్టీలు తమ కుళ్లు రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల కోసం పని చేయడం నేర్చుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం కరవు మండలాలకు నిధులు ఇవ్వడం లేదని, పేద పిల్లల చదవులతో ఆటలాడుకుంటోందని ధ్వజమెత్తారు.

English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy blamed Congress government for Rachabanda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X