వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై మాట్లాడను, ఆజాద్‌ చెప్తారు: మనీష్ తివారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Manish Tiwari
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై మాట్లాడడానికి ఎఐసిసి అధికార ప్రతినిధి మనీష్ తివారీ నిరాకరించారు. తెలంగాణపై రోజుకో ప్రకటన చేసి సంక్లిష్టం చేసుకోబోమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణపై చర్చలు కొనసాగుతున్నాయని, ఏమైనా పురోగతి ఉంటే వెల్లడిస్తామని ఆయన అన్నారు. తెలంగాణపై పూర్తి వివరాల కోసం పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌ను అడగాలని ఆయన సూచించారు. తెలంగాణ సున్నితమైన అంశమని ఆయన అన్నారు.

ఉత్తరప్రదేశ్ విభజనపై తీర్మానాన్ని చర్చ లేకుండా రాష్ట్ర శాసనసభలో ఆమోదించడం దురదృష్టకరమని ఆయన అన్నారు. చర్చ లేకుండా విభజన కోసం ఉత్తరప్రదేశ్ శాసనసభ తీర్మానాన్ని ఆమోదించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన అన్నారు. యుపిని నాలుగు రాష్ట్రాలుగా విభజించాలనే తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తీరును ఆయన తప్పు పట్టారు. ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించిన తీర్మానంపై ప్రతిస్పందించడం కూడా అనవసరమని ఆయన అన్నారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తమ పార్టీ రాష్ట్రాల విభజనపై నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.

English summary
AIIC spokesperson Manish Tiwari rejected to comment on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X