వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంటులో చిదంబరానికి బహిష్కరణ సెగ, కాంగ్రెసు వ్యూహం

By Pratap
|
Google Oneindia TeluguNews

P Chidambaram
న్యూఢిల్లీ: రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు వాడిగా, వేడిగా జరగనున్నాయి. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో హోం మంత్రి పి. చిదంబారన్ని బహిష్కరించాలని బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ నిర్ణయించింది. పార్లమెంటు సమావేశాల్లో హోం మంత్రి పి. చిదంబరం ప్రసంగాన్ని అడ్డుకోవాలని ఎన్‌డిఎ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం వెలుగు చూసిన 2008లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నారు. లోక్‌పాల్, ఆహార భద్రత, భూసేకరణ వంటి పలు ముఖ్యమైన బిల్లులను ఈ సమావేశాల్లో ప్రతిపాదించాలని ప్రభుత్వం తలపెట్టింది. నల్లధనంపై ఎన్‌డిఎ రేపు వాయిదా తీర్మానం ప్రతిపాదించనుంది. ధరల పెరుగుదలపై వామపక్షాలు తీర్మానం ప్రతిపాదించాలని నిర్ణయించాకయి.

కాగా, తెలంగాణపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పార్లమెంటును స్తంభింపజేస్తామని చెప్పారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెసు కోర్ కమిటీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో సమావేశమైంది. ఈ సమావేశానికి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ కూడా హాజరయ్యారు. తెలంగాణపై అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. తెరాసకు చెందిన ఇద్దరు లోకసభ సభ్యులు తెలంగాణ అంశాన్ని లేవనెత్తితే తమ పార్టీ తెలంగాణ సభ్యులు ఎలా వ్యవహరిస్తారనే విషయంపై కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. బిజెపి అనుసరించే వైఖరిపై కూడా చర్చ చేసి, తాము అనుసరించాల్సిన వ్యూహంపై నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

నల్లధనం, 2జి స్పెక్ట్రమ్ స్కామ్, ఉత్తరప్రదేశ్ విభజన వంటి అంశాలతో ప్రతిపక్షాలు తమను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించవచ్చునని కాంగ్రెసు భావిస్తోంది. బిఎస్‌పి సభ్యులు ఉత్తరప్రదేశ్ విభజనకు శాసనసభ సమావేశం తీర్మానాన్ని ప్రస్తావిస్తే ఎలా వ్యవహరించాలనే అంశంపై కూడా ప్రధానంగా కోర్ కమిటీ చర్చించినట్లు తెలుస్తోంది.

English summary
It is said that BJP lead NDA has decided to boycott Home Minister P Chidambaram in the winter session of Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X