వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌కు పార్లమెంటులో మాయావతి ఎంపిల తోడు?

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao and Mayawati
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేస్తామని ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుకు మద్దతిచ్చే వారెవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడానికి తెరాస లోకసభ సభ్యులు కెసిఆర్, విజయశాంతి సోమవారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తెలంగాణపై రేపు ఉదయం 8 గంటలకు వాయిదా తీర్మానం ప్రతిపాదిస్తామని కెసిఆర్ చెప్పారు. తాజాగా, కెసిఆర్‌కు కొత్త దోస్తీ దొరికినట్లు కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ విభజనకు శాసనసభలో తీర్మానం చేసిన ముఖ్యమంత్రి మాయావతి తెలంగాణకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. తెలంగాణపై మాయావతి నాయకత్వంలోని బిఎస్‌పి సభ్యుల మద్దతు లోకసభలో కెసిఆర్‌కు లభించే అవకాశాలున్నాయని అంటున్నారు.

తాను మాయావతిని కలుస్తానని, తమకు బిఎస్‌పి పూర్తి మద్దతు ఇస్తుందని కెసిఆర్ అంటున్నారు. బిఎస్‌పి కెసిఆర్‌కు మద్దతిస్తే లోకసభలో వేడి పుట్టే అవకాశం ఉంది. బిఎస్‌పి సభ్యులు యుపి విభజన అంశాన్ని ప్రధానం చేసుకుని తెలంగాణకు మద్దతు పలికే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం బిజెపి వైఖరి ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరంగానే ఉంది. బిజెపికి తెలంగాణ అంశం కన్నా నల్లధనం, 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం ప్రధానం కావచ్చునని అంటున్నారు. కేంద్ర హోం మంత్రి పి. చిదంబరాన్ని లక్ష్యం చేసుకోవాలని, పార్లమెంటులో చిదంబరం ప్రసంగాన్ని అడ్డుకోవాలని బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ అడ్డుకోవాలని నిర్ణయం తీసుకుంది. అందువల్ల బిజెపి కోరిక మేరకు కెసిఆర్ తెలంగాణ అంశంపై కేంద్రాన్ని నిలదీయడానికి సమయం తీసుకుంటారా అనే సందేహం కూడా కలుగుతుంది.

కాగా, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ఎలా వ్యవహరిస్తారనేది కూడా ఉత్కంఠను కలిగించే విషయమే. తెరాసకు దీటుగా వారు నిలబడతారా, లేదా అనేది అనుమానంగానే ఉంది. 2014 ఎన్నికల వరకు కాలయాపన చేయాలనే పార్టీ అధిష్టానం ఆలోచనకు అనుగుణంగానే కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుల వ్యూహం ఉండవచ్చునని అంటున్నారు. ఏమైనా, కెసిఆర్ పూర్తిగా నెట్టుకొస్తారనే గ్యారంటీ ఏమీ లేదని అంటున్నారు.

English summary
It is an interesing point that wether UP CM Mayawathi lead BSP MPs support TRS president K Chandrasekhar Rao, or not in Loksabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X