వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెప్పడానికి మాకు అవకాశం లభించింది: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
రాజమండ్రి/ న్యూఢిల్లీ: తమ ఆస్తులపై విచారణకు సంబంధించి తమ వాదనను వినిపించడానికి సుప్రీంకోర్టు ఆదేశాలతో అవకాశం లభించిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో రైతు పోరు బాటలో పాల్గొన్న ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమ వాదనలను హైకోర్టులో వినిపించుకోవడానికి అవకాశం లభించిందని ఆయన అన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని ఆయన చెప్పుకున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో అధికారులను, పారిశ్రామికవేత్తలను భ్రష్టు పట్టించారని ఆయన విమర్శించారు.

శానససభా సమావేశాలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోందని ఆయన అన్నారు. వచ్చే శాసనసభా సమావేశాల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదిస్తామని ఆయన చెప్పారు. తమ పార్టీ ఏర్పాటు చేసిన పునాదులపై కాంగ్రెసు ప్రభుత్వం ప్రభుత్వం కొనసాగుతోందని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని ఆయన అన్నారు. రైతు సమస్యలపై జాతీయ స్థాయిలో తాను పోరాటం చేస్తానని ఆయన అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్‌పై తమకు సహజ న్యాయం జరగలేదనే తాము సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు అన్నారు. సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరిగిందని, తమ వాదనను వినిపించుకోవడానికి అవకాశం చిక్కిందని ఆయన బుధవారం న్యూఢిల్లీలో మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను పార్టీపరంగా సుప్రీంకోర్టుకు వెళ్లలేదని, కంపెనీపరంగా మాత్రమే వెళ్లానని ఆయన చెప్పారు. రాజకీయ దురుద్దేశంతోనే విజయమ్మ తమపై పిటిషన్ వేశారని ఆయన విమర్శించారు. ఒక రైతు బిడ్డగా ఖాయిలా పడిన పంచదార పరిశ్రమను తాను పునరుద్ధరించానని ఆయన చెప్పుకున్నారు. చక్కెర పరిశ్రమల అమ్మకం సక్రమంగానే జరిగిందని హైకోర్టుకు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అపిడవిట్ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.

ప్రజా సేవ చేస్తున్న ఎన్టీఆర్ ట్రస్టుపైనా బురద చల్లుతున్నారని ఆయన విమర్శించారు. వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ విచారణ నుంచి దృష్టి మళ్లించడానికే తమపై పిటిషన్ వేశారని ఆయన అన్నారు. హైకోర్టులో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు.

English summary
TDP president N Chandrababu Naidu said that they got chance to say their arguement in High Court with Supreme Court orders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X