వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గఢాపీ తనయుడు సైఫ్‌కూ సెక్స్ పిచ్చి: మాజీ భార్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Saif al-Islam
లండన్: లిబియా మాజీ నియంత గఢాఫీ కుమారుడు సైఫ్ ఆల్ - ఇస్లామ్‌కు ఆడవాళ్ల పిచ్చి ఎక్కువ అని, సెక్స్ పిచ్చి చాలా ఎక్కువ అని అతని ఉక్రెయిన్ మహిళ చెబుతోంది. సైఫ్ తరుచు గృహ హింసకు పాల్పడుతుండేవాడని చెప్పింది. తనను ఆమె సైఫ్ మాజీ భార్యగా చెప్పకుంటోంది. ప్రస్తుతం ఆమె వయస్సు 39 ఏళ్లు. మాస్కో నైట్ క్లబ్‌లో స్ట్రిప్పర్‌గా పనిచేస్తున్నప్పుడు సైఫ్‌ను తాను మొదటిసారి కలిసినట్లు నాడియా అనే ఆ నీలికళ్ల మహిళ చెబుతోంది. అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత కన్వత్యాన్ని పునరుద్ధరించుకునే శస్త్రచికిత్స చేయించుకోవడానికి ప్యారిస్‌కు పరుగెత్తాల్సి వచ్చిందని ఆమె చెప్పింది.

సైఫ్ ఆంటీ సమక్షంలో తన నిజాయితీని నిరూపించుకోవాల్సి వచ్చిందని, ఆ తర్వాత తాను ఇస్లాం మతం స్పీకరించానని, తాను సాధారణ జీవితం గడపడానికి ప్రయత్నించానని, అయితే సైఫ్ అనుమతించలేదని ఆమె చెప్పింది. తాను పెళ్లి కోసం ఇస్లాం స్వీకరించినా తమలో కలుపుకోలేకపోయారని ఆమె చెప్పింది. సైఫ్ డ్రగ్స్ తీసుకునేవాడని, నార్కోటిక్స్ తీసుకున్నప్పుడు తనను తాను నియంత్రించుకోలేకపోయేవాడని ఆమె చెప్పింది. సైఫ్‌కు లైంగికపరమైన వైపరీత్యాలుండేవని, ఉదాహరణకు పబ్లిక్‌గా సెక్స్ చేయాలని కోరుకునేవాడని, దాంతో అతనితో కలిసి ఉండలేననే నిర్ణయానికి వచ్చానని ఆమె చెప్పింది.

తమ సహజీవనం ఓ రెస్టారెంట్‌లో ఆగ్రహజ్వాలల మధ్య ముగిసిందని, సైఫ్ తనను కొట్టాడని, కిటికీలోంచి బయటకు విసిరేశాడని, 47 రోజుల పాటు కోమాలో ఉండి బతికి బయటపడ్డానని ఆమె చెప్పింది. తనను ఆస్పత్రి పాలు కావడం గఢాఫీకి కోపం తెప్పించిందని, కుటుంబ ప్రతిష్టను దెబ్బ తీశావంటూ సైఫ్‌ను ఎడారికి పంపించేశాడని ఆమె చెప్పింది. ఆ తర్వాత లిబియా వదిలేసి మాస్కో చేరుకుంది. చివరిసారిగా 2008లో సైఫ్ తన వద్దకు వచ్చి కలిసి ఉందామని చెప్పాడని, తాను నిరాకరించానని ఆమె చెప్పింది.

English summary
Saif al-Islam was a womaniser who often indulged in domestic violence, according to a Ukrainian woman who claims to be a former wife of the captured son of slain Libyan dictator Muammar Gaddafi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X