హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజీనామా ఆమోదించొద్దని చెప్పా:ఎమ్మెల్యే సోమారపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Somarapu Satyanarayana
హైదరాబాద్: తన రాజీనామాను ఆమోదించవద్దని స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కోరినట్లు ఇటీవలె టిఆర్ఎస్‌లో చేరిన స్వతంత్ర్య ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. బుధవారం సోమారపు, వరంగల్ జిల్లా ఎమ్మెల్యే రాజయ్య స్పీకర్ ముందు హాజరయ్యారు. భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తాను స్వతంత్ర్య అభ్యర్థిగా గెలుపొందినందున అనర్హత తనకు వర్తించదని చెప్పారు. తన రాజీనామాను ఆమోదించవద్దని స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు. స్పీకర్ వ్యక్తిగతంగా చాలా నిజాయితీపరులని కానీ పార్టీ ఒత్తిడి మేరకు ఆయన పని చేసే అవకాశముందన్నారు. తన రాజీనామా ఆమోదిస్తే అది కాంగ్రెసు వ్యూహంగానే భావించాల్సి ఉంటుందన్నారు.

ఇటీవల తన నియోజకవర్గంలో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్న డిఎస్పీ, సిఐపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌కు చెప్పానన్నారు. రాజీనామాపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానన్నారు. తెలంగాణ మంత్రులు వెంటనే రాజీనామా చేయాలన్నారు. యుపి ముఖ్యమంత్రి మాయావతిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.

English summary
MLAs Somarapu Satyanarayana and Rajaiah attended before speaker Nadendla Manohar today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X