• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

న్యాయం జరిగిందన్న టిడిపి,బాబు పత్రాలందలేదన్న జెడి

By Srinivas
|

TDP Logo
న్యూఢిల్లీ/హైదరాబాద్: సుప్రీం కోర్టులో తమకు న్యాయమే జరిగిందని టిడిపి నేత సిఎం రమేష్ బుధవారం స్పష్టం చేశారు. హైకోర్టు సిబిఐ విచారణ తీర్పుపై సిఎం రమేష్, రామోజీరావు, నామా నాగేశ్వర రావు సుప్రీం కోర్టుకు వెళ్లడం, వారి పిటిషన్లు సుప్రీం తోసిపుచ్చుతూ ఈ అంశం హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. దీనిపై సిఎం రమేష్ స్పందించారు. సుప్రీంలో మాకు న్యాయమే జరిగిందని ఆయన అన్నారు. తమకు చుక్కెదురైందన్న ప్రచారం సరికాదన్నారు. తమ వాదనలు విననందునే అప్పీలు చేశామని ఇప్పుడు హైకోర్టును తమ వాదనలు వినాలని సూచించడం ద్వారా సుప్రీంలో తమకు న్యాయం జరిగినట్లేనన్నారు.

మరోవైపు టిడిపి నేతలు కూడా సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నారు. మేం ఊహించిందే జరిగిందన్నారు. సుప్రీం తీర్పుతో హైకోర్టులో తమకు వాదనలు వినిపించే అవకాశం వస్తుందని తాము భావిస్తున్నట్లు చెప్పారు. అప్పీలుకు వెళ్లింది వ్యక్తులే కాని తమ అధినేత చంద్రబాబు కాదన్నారు. హైకోర్టు తమ వాదనలు వినలేదనే అప్పీలుకు వెళ్లామని ఇప్పుడు సుప్రీం డైరెక్షన్ తమకు సంతృప్తినిచ్చిందన్నారు.

కాగా చంద్రబాబు విచారణకు సంబంధించిన పత్రాలు తమకు అందలేదని సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ హైదరాబాదులో అన్నారు. కోర్టు నుండి పత్రాలు అందగానే విచారణ ప్రారంభిస్తామని చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు కేసులో నోటీసులు అందజేసిన తర్వాతే విచారణ చేపడతామని అన్నారు.

English summary
Telugudesam Party welcomed Supreme Court judgement on Nama Nageshwar Rao, Ramoji Rao and CM ramesh petition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X