వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైఫ్‌పార్ట్‌నర్ రేప్ చేశాడని హైదరాబాద్ యువతి ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Woman accuses live-in partner of rape
ముంబై: తనతో కొంతకాలం సహజీవనం చేసిన వ్యక్తికి పెళ్లైందని తెలిసిన ఓ మహిళ అతనిపై ముంబై పోలీసు స్టేషన్‌లో రేప్ చేశాడంటూ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బోరివ్లీ పోలీసులు నిందితుడిని ఇటీవలె అరెస్టు చేశారు. బాధితురాలు హైదరాబాద్‌కు చెందిన మహిళ. ఆమె దుబాయ్‌లో పని చేస్తోంది. ఆమె మరో వ్యక్తితో కలిసి 2006 నుండి ఒకే అపార్టుమెంటులో ఉంటోంది. వారి సాన్నిహిత్యం 2008 వరకు మరింత బలపడి అది సహజీవనం వరకు వెళ్లింది. ఆమె మూడుసార్లు గర్భం ధరించింది. అతని బలవంతం మీద రెండుసార్లు ఆమె హైదరాబాద్ వచ్చి అబార్షన్ చేయించుకుంది. మూడోసారి గర్భం ధరించినప్పుడు ఆమె అబార్షన్‌కు తిరస్కరించింది.

దీంతో వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. తామిద్దరం దుబాయ్‌లో సహజీవనం చేస్తున్న సమయంలో అతని తల్లిదండ్రులు అక్కడే నెల రోజులు ఉన్నారని, తమ సంబంధం గురించి వారికి తెలుసునని బాధితురాలు పోలీసులకు వివరించింది. 2010లో నిందితుడు తన సోదరి పెళ్లి కోసం ముంబై వెళ్లాడు. తల్లిదండ్రుల కోరిక మేరకు అతను కూడా అప్పుడే ఓ యువతిని పెళ్లాడాడు. దుబాయ్ తిరిగి వచ్చాక తనతో సహజీవనం చేస్తున్న బాధితురాలికి ఈ విషయం చెప్పకుండానే ఆమెతో తన సంబంధాన్ని కొనసాగించాడు. కొంతకాలం తర్వాత నిందితుడు ఆమె నుండి దూరం అయ్యేందుకు నిర్ణయించుకోవడంతో తనతో ఇన్నాళ్ల నుండి ఉంటున్నప్పటికీ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదని ప్రశ్నించింది.

అప్పుడతను తనకు వేరే యువతితో పెళ్లైన విషయాన్ని చెప్పి తన భార్యకు విడాకులు ఇచ్చి తనను చేసుకుంటానని చెప్పాడు. బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి తమిద్దరి పెళ్లి విషయాన్ని అతని తల్లిదండ్రుల దృష్టికి తీసుకు వచ్చారు. వారు అందుకు అంగీకరించలేదు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతని లాప్ టాప్ నుండి అసభ్యకరమైన చిత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

English summary
A woman lodged a case of rape against her live-in partner after she discovered that he had married someone else. Based on her complaint, the Borivli police recently arrested the accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X