హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీవారి హుండీలో 162 వజ్రాలు, అజ్ఞాత భక్తుడి సమర్పణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tirumala
హైదరాబాద్: ఓ అజ్ఞాత భక్తుడు తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామికి 162 విలువైన వజ్రాలు సమర్పించారు. సదరు భక్తుడు మంగళవారం ఈ వజ్రాలను శ్రీవారి హుండీలో వేసినట్లుగా భావిస్తున్నారు. బుధవారం పరకామణిని లెక్కించే సమయంలో హుండీలో అధికారులు ఈ వజ్రాలను కనుగొన్నారు. వాటిని చూసిన అధికారులు మొదట ఆశ్చర్యపోయారు. సాధారణంగా భక్తులు బంగారం, వెండి తదితర వస్తువులను హుండీలో వేస్తారు. అధికారులు వాటిని కరిగించి భండాగారానికి పంపిస్తారు.

కాగా ఈ వజ్రాల విలువ సుమారు రూ.నలభై లక్షల వరకు ఉంటుందని జమాలజీ నిపుణులు విలువ కట్టారు. టిటిడి జెఈవో శ్రీనివాస రాజు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. టిటిడి అధికారులు వజ్రాలు వచ్చినప్పుడు వాటిని భద్రపరిచి అవసరమైనప్పుడు శ్రీవారికి కిరీటం తదితర నగలు చేయిస్తారు.

English summary
A devotee donated 162 diamonds to Lord Venkateswara in Tirumala. Officials were surprised to see the diamonds in the Srivari hundi during counting at Parakamani on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X