వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శరద్ పవార్‌పై సెటైర్లు, అన్నా హజారే దిష్టిబొమ్మ దగ్ధం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anna Hazare
ముంబై: ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త అన్నాహజారే దిష్టి బొమ్మను నేషనలిస్ట్ కాంగ్రెసు పార్టీ(ఎన్‌సిపి) కార్యకర్తలు శుక్రవారం మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో దగ్ధం చేశారు. గురువారం ఎన్‌సిపి పార్టీ అధినేత, కేంద్రమంత్రి శరద్ పవార్‌పై హర్వీందర్ సింగ్ అనే యువకుడు ధరల పెరుగుదలకు నిరసనగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఇది తెలిసిన అన్నా హజారే చెంపదెబ్బ తిన్నాడా? ఒక్క దెబ్బేనా? అని సెటైర్ వేశారు. ఓ కేంద్రమంత్రి, ఓ పార్టీ అధినేతను సామాన్య యువకుడు చెంపపై కొడితే అన్నా వ్యాఖ్యలు అభ్యంతరంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఎన్సీపీ కార్యకర్తలు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

పూణే, కొల్హాపూర్, సతారా తదితర పట్టణాలలో ఎన్సీపీ నేతలు బందుకు పిలుపునిచ్చారు. కాగా గురువారం పవార్‌పై దాడి విషయంలో అన్నా మొదట అలా మాట్లాడినప్పటికీ వెంటనే వాటిని కరెక్ట్ చేసుకున్నారు. ఇటువంటి హింసాత్మక సంఘటనలు మంచిది కాదన్నారు. తాను విజిటర్స్‌తో మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి పవార్‌ను కొట్టాడని స్లిప్ పంపారని, కొట్టాడా? ఇంకేమైనా చేశాడా? అని అడిగానని చెప్పారు.

English summary
NCP activists burnt Anna Hazare's effigy in Maharashtra for his comments against party chief Sharad Pawar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X