వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోనేరు ప్రసాద్ ఇక ప్రత్యేక ఖైదీ, ప్రత్యేక కోర్టు ఆదేశాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Koneru Prasad
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో నిందితుడు, స్టైలిష్ హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోనేరు ప్రసాద్‌ను ప్రత్యేక ఖైదీగా గుర్తిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలంటూ కోనేరు ప్రసాద్ పెట్టుకున్న పిటిషన్‌పై కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది. తాను రెండు కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నానని, తన ఆరోగ్యం కూడా సరిగా లేదని అంటూ తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని కోనేరు ప్రసాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, కోనేరు ప్రసాద్‌ను ప్రత్యేక కోర్టుగా గుర్తించకూడదని సిబిఐ వాదించింది. వాదనలు ముగిసిన తర్వాత కోర్టు తన నిర్ణయం ప్రకటించింది.

ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో అరెస్టయి కోనేరు ప్రసాద్‌ను సిబిఐ 11 రోజుల పాటు తన కస్డడీలోకి తీసుకుని విచారించింది. ఆ తర్వాత కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో శబరమల వెళ్లి వచ్చి ఈ నెల 22వ తేదీన లొంగిపోయారు. ఆ తర్వాత ఆయనకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ప్రత్యేక ఖైదీగా గుర్తించడం వల్ల జైలులో కోనేరు ప్రసాద్‌కు ప్రత్యేకమైన సెల్‌ను కేటాయించడంతో పాటు అదనపు వసతులు కల్పిస్తారు.

English summary
Court passed orders identifying Koneru Prasad, accused in Emaar Properties case, as special prisiner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X