• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్‌తో ఒక్క చేప లేదు బలం తగ్గుతోంది: వీర శివా రెడ్డి

By Srinivas
|

Veera Siva Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఒక్క చేప కూడా లేదని కాంగ్రెసు పార్టీ సీనియర్ ఎమ్మెల్యే వీర శివా రెడ్డి శుక్రవారం అన్నారు. గురువారం జరిగిన జగన్ ఎమ్మెల్యేల భేటీకి వెళ్లిన వాళ్లలో చాలామంది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని సమర్థిస్తారన్నారు. జగన్ బలం రోజు రోజుకు తగ్గిపోతోందన్నారు. ఆయనతో ఉన్న ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అవిశ్వాసం విషయంలో బోల్తా కొట్టించాలని చూస్తే అందుకు తగినట్టుగా తాము వ్యవహరిస్తామన్నారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు రాజకీయ డ్రామా అడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ గుంటూరు జిల్లాలో వేరుగా అన్నారు. బ్లాక్ మెయిల్ చేయడానికే వారు రాజీనామాలు ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. అధికారులతో పాపాలు చేయించిన మంత్రుల పైనా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సిబిఐ విచారణలో అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారులు జైళ్లకు వెళ్లడం మంచిదేనన్నారు.

English summary
Veera Siva Reddy says no one mlas went with YSR Congress Party president YS Jaganmohan Reddy. All the mlas will support Kiran government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X