వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోల్‌కతాలో విప్లవ రచయిత వరవరరావు అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Varavara Rao
కోల్‌కతా: విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావును పోలీసులు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో శుక్రవారం అరెస్టు చేశారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వర రావు కూతురుతో కలిసి వరవరరావు హైదరాబాదు నుంచి బయలుదేరి కోల్‌కతాకు చేరుకున్నారు. కోల్‌కతా విమానాశ్రయంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కిషన్‌జీ భౌతిక కాయానికి పోస్టు మార్టం నిర్వహించాలని, ఆయన మృతదేహాన్ని స్వస్థలానికి పంపే ఏర్పాట్లు చేయాలని వరవరరావు డిమాండ్ చేస్తున్నారు.

కిషన్‌జీ మృతదేహాన్ని మిడ్నాపూర్ ఆస్పత్రికి తరలించారు. కిషన్‌జీ స్వస్థలం కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మిత్రులు, బంధువులు, సానుభూతిపరులు పెద్ద యెత్తున పెద్దపల్లికి చేరుకుని కిషన్‌జీ కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. తన కుమారుడిది బూటకపు ఎన్‌కౌంటర్ అని కిషన్‌జీ తల్లి మధురమ్మ ఆరోపిస్తున్నారు. కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి.

English summary
Revolutionary writer Varavara Rao arrested in Kolkata, reached for Kishenji dead body.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X