చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణపై కేసు కొట్టివేత

By Pratap
|
Google Oneindia TeluguNews

Vemuri Radhakrishna
చిత్తూరు : 'ఆంధ్రజ్యోతి' మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ, పత్రిక పూర్వ సంపాదకుడు శ్రీరామచంద్ర మూర్తి, ఇతర సిబ్బందిపై ఐపీఎస్ అధికారి గోపాలకృష్ణ పెట్టిన క్రిమినల్ కేసును కోర్టు కొట్టివేసింది. ఓ వ్యక్తి అదృశ్యానికి సంబంధించిన కేసు విచారణలో భాగంగా 2006 సెప్టెంబరులో హైకోర్టు అప్పటి చిత్తూరు జిల్లా ఎస్పీ గోపాలకృష్ణపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విచారణకు ఎస్పీ హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది.

దానిపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో 'ఆంధ్రజ్యోతి'లో వార్త ప్రచురితమైంది. ఈ వార్తతో తన పరువు ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయంటూ గోపాలకృష్ణ చిత్తూరు 4వ ఏడీఎం కోర్టులో పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ, అప్పటి ఎడిటర్ శ్రీరామచంద్రమూర్తి, తదితరులపై క్రిమినల్ కేసు పెట్టారు.నాలుగేళ్లపాటు విచారణ జరిగింది. ఆరోపణలు రుజువు కాకపోవడంతో కోర్టు శుక్రవారం కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. ఈ కేసులో 'ఆంధ్రజ్యోతి' తరఫున సీనియర్ న్యాయవాది నల్లారి ద్వారకానాథ రెడ్డి వాదించారు.

English summary
Defemation case against Andhrajyothy daily was quashed by Chittoor court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X