వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దమ్ముంటే నన్ను జైల్లో పెట్టండి: ప్రభుత్వానికి గద్దర్ సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gaddar
కరీంనగర్: కిషన్‌జీతో పాటు తాను కూడా నలబై రోజుల పాటు మిలటరీ శిక్షణ తీసుకున్నానని ప్రభుత్వానికి దమ్ముంటే తనను అరెస్టు చేసి జైల్లో పెట్టాలని ప్రజా గాయకుడు గద్దర్ ఆదివారం సవాల్ విసిరారు. ఆయన కరీంనగర్ జిల్లాలో ఇటీవల ఎన్‌కౌంటర్లో మృతి చెందిన కిషన్‌జీ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ నరసింహన్ మనిషి రక్తం తాగే పులి వంటి వాడని విమర్శించారు. కిషన్‌జీది బూటకపు ఎన్‌కౌంటర్ అన్నారు. దీనిపై న్యాయవిచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మావోయిస్టుల అండతో అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ ప్రభుత్వం ఇప్పుడు అదే నక్సలైట్ల నెత్తురు తాగే పులి అయిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే కిషన్‌జీని హత్య చేశాయన్నారు.

తెలంగాణ కోసం కిషన్‌జీ ఎంచుకున్న పోరాటానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆయన మార్గంలో నడుస్తూ ఆయన తెలంగాణ కల నెరవేరుస్తామన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని అణిచి వేయడానికి చాప్టర్8 ఎలా ఉపయోగిస్తున్నారో కిషన్‌జీ ఎన్‌కౌంటర్ అలాగే ఉందన్నారు. ఆయన మృతదేహాన్ని రాష్ట్ర ప్రజలకు చూపించక పోవడం అందులో భాగమేనన్నారు. శరీరం అంతా కుళ్లబొడిచి కిషన్‌జీని అతిదారుణంగా హత్య చేశారని వరవరరావు అన్నారు. కాగా కిషన్‌జీ మృతదేహాన్ని అర్ధరాత్రి రెండు గంటలకు కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి తరలించారు. మృతదేహాన్ని చూడటానికి చుట్టుపక్కల ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భారీగా పోలీసులను మోహరించారు.

English summary
Gaddar challenged government and governor Narasimhan for his arrest. He appeared at Peddapalli of Karimnagar to see Kishanji dead body.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X