వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా ఏరియాకొస్తే తరిమి కొడతా: ఎమ్మెల్యే చింతమనేని

By Srinivas
|
Google Oneindia TeluguNews

Prabhakar Chintamaneni
ఏలూరు: తన ఏరియాలోకి వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తరిమి తరిమి కొడతానని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదివారం కాంగ్రెసు నేతలను హెచ్చరించారు. ఆయన స్థానిక పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు, మంత్రి వట్టి వసంత్ కుమార్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో కావూరి రూ.14 కోట్లు దోచుకున్నారని విమర్శించారు. జిల్లా పోలీసులు మంత్రి వట్టికి తొత్తులుగా మారారని విమర్శించారు. వారు రాజీనామాలు చేసి వస్తే బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. తనపై రౌడీషీట్ తెరిచేకా ఎమ్మెల్యేనయ్యానని పిచ్చి పిచ్చి వేషాలేస్తే తరిమి కొడతానన్నారు.

కాగా చింతమనేని వర్గం ఏలూరులో మంత్రి వట్టికి వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహించారు. తమ ఎమ్మెల్యేపై చేయి చేసుకున్న మంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వట్టిపై వెంటనే పోలీసు కేసు నమోదుచేయాలని లేదంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. చింతమనేని వర్గం ఆందోళనతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచి పోయాయి.

English summary
MLA chintamaneni prabhakar warned Minister Vatti Vasanth Kumar today. He demanded him for resign. He also lashes out at MP Kavuri Sambasiva Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X