వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి విప్ జారీ చేసినా వెళ్లొద్దని ఎమ్మెల్యేల నిర్ణయం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

TDP Logo
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ విప్ జారీ చేస్తే దానిని భేఖాతరు చేయాలని ఆ పార్టీ నుండి బయటకు వెళ్లిన సముద్రాల వేణుగోపాల చారి, గంపా గోవర్దన్, జోగు రామన్నలు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వారు పార్టీకి, శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశారు. అయితే వారి రాజీనామాలు స్పీకర్ ఇంకా ఆమోదించక పోవడంతో టిడిపి వారికి కూడా విప్ జారీ చేయాలని నిర్ణయించుకుంది. రెండు రోజుల క్రితం రిజిస్టర్ పోస్టు ద్వారా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి, కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న వారికి విప్ జారీ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే వారు మాత్రం తమకు విప్ జారీ చేసినా పార్టీ సమావేశానికి వెళ్ల వద్దని నిర్ణయించుకున్నారు.

డిసెంబర్ 1వ తేది నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేయాలని పార్టీ భావిస్తోంది. ఈ నెలాఖరులో బాబు ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి కూడా హాజరు కావాలని విప్ జారీ చేయనుంది. అయితే శాసనసభ్యత్వాలకు, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన వారికి విప్‌లు జారీ చేయడంలో అర్థం లేదంటున్నారు నాగం జనార్ధన్ రెడ్డి వంటి నేతలు.

English summary
MLAs Jogu Ramanna, Venugopala Chary and Gampa Govardhan decided to not go Telugudesam Party meeting also issue whip.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X