వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎట్టకేలకు కనిమొళికి ఊరట, బెయిల్ మంజూరు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kanimozhi
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో ఎట్టకేలకు డిఎంకె అధినేత కరుణానిధి ముద్దుల కూతురు, పార్లమెంటు సభ్యురాలు కనిమొళికి ఊరట లభించింది. ఆమెతో పాటు ఐదుగురికి ఢిల్లీ హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. కలైంగర్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ శరద్ కుమార్, సినీయుగ్ అధినేత కరీం మొరానీ, కుసేగావ్ ఫ్ర్యూట్స్ అండ్ వెజిటేబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు అసిఫ్ బాల్వా, రాజీవ్ బి. అగర్వాల్‌లకు కూడా బెయిల్ మంజూరు అయింది. ఈ ఏడాది మే 20వ తేదీ నుంచి కనిమొళి తీహార్ జైలులో ఉంటున్నారు. తమ బెయిల్ పిటిషన్లపై విచారణను త్వరగా చేపట్టాలని కనిమొళితో పాటు మిగతా నలుగురు హైకోర్టును కోరారు. ఆ మేరకు ఢిల్లీ హైకోర్టు డిసెంబర్ 1వ తేదీకి బదులు సోమవారమే విచారణ చేపట్టింది. ఐదు లక్షల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దేశం విడిచి వెళ్లరాదని కూడా హైకోర్టు కనిమొళిని, ఇతరులను ఆదేశించింది.

కనిమొళితో పాటు మిగతా వారి బెయిల్ పిటిషన్లను సిబిఐ వ్యతిరేకించలేదు. దీంతో వారికి బెయిల్ మంజూరైంది. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు గత వారం కార్పొరేట్ సంస్థలకు చెందిన ఐదుగురు ఎగ్జిక్యూటివ్‌లకు బెయిల్ మంజూరు చేసింది. యునిటెక్ వైర్‌లెస్ మాజీ ఎండి సంజయ్ చంద్ర, స్వాన్ టెలికం డైరెక్టర్ వినోద్ గోయెంకా, రిలయన్స్ అనిల్ దీరుభాయ్ అంబానీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్‌లు హరి నాయర్, గౌతం దౌషీ, సురేంద్ర పిపారాలకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

English summary
DMK MP Kanimozhi's was on Monday granted bail by the Delhi high court in the 2G case. Asif Balwa and three others was also granted bail by the court. However, former telecom secretary Siddharth Behura was denied bail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X