వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పదిమంది కేకలేసి రాష్ట్రమంటే వందైనా సరిపోవు: కిశోర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishore Chandradev
విశాఖపట్నం: తాను చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం కాదని అయితే ఓ పదిమంది కలిసి ప్రత్యేక రాష్ట్రం కావాలని కేకలేస్తె మాత్రం దానితో విబేధిస్తానని కేంద్రమంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ఆదివారం విశాఖలో అన్నారు. ముఖ్యమంత్రి పదవి ఆశించే వ్యక్తుల కోసం ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేయదలిస్తే వంద రాష్ట్రాలు కొత్తగా పెట్టినా సరిపోవని అన్నారు. ప్రత్యేక మన్యసీమ రాష్ట్రం కావాలని తాను ఎప్పుడూ కోరలేదన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు మంచిదేనని డాక్టర్ అంబేద్కర్ చెప్పింది అర్ద శతాబ్దం కిందట అన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు వేరని చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు ప్రస్తుతం అనుకూలంగా లేదన్నారు.

గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ తవ్వకాలకు తాను వ్యతిరేకమన్నారు. గనులు అడ్డగోలుగా ఎవరైనా తవ్వితే వాటిని రద్దు చేయిస్తానన్నారు. లీజులు ఇచ్చే ముందు తప్పనిసరిగా ఆయా ప్రాంతాల్లో గ్రామసభలు నిర్వహించాలన్నారు. ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని సభలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. సభకు ఎవరూ రాలేదని చెప్పి రికార్డులు తయారు చేయడాన్ని నివారిస్తామన్నారు.

English summary
Central Minister Kishore Chandradev said that he is support separate states but this is the not right time for divide the states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X