వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జి స్పెక్ట్రమ్ స్కామ్ కేసులో షాహిద్ బాల్వాకు బెయిల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Shahid Balwa
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో స్వాన్ టెలికం ప్రమోటర్ షాహిద్ బాల్వాకు సిబిఐ ప్రత్యేక కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. కనిమొళి, తదితరులకు ఇప్పటికే ఈ కేసులో బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. బాల్వా బెయిల్ పిటిషన్‌ను సిబిఐ వ్యతిరేకించలేదు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అభియోగాలు నమోదు చేసినందున తాము బాల్వా బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించడం లేదని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యుయు లలిత్ సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపి సైనీకి చెప్పారు.

సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన టెలికం డైరెక్టర్ వినోద్ గోయెంకాపై మోపిన అభియోగాలకు మాదిరి అభియోగాలనే బాల్వాపై మోపామని లలిత్ చెప్పారు. ఆరు నెలల పాటు జైలులో ఉన్న డిఎంకె పార్లమెంటు సభ్యురాలు కనిమొళికి, తదితరులకు ఢిల్లీ హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. కనిమొళి మంగళవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి.

English summary
The Special CBI court granted bail to Swan Telecom promoter Shahid Balwa in the 2G Spectrum case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X