వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పును అంగీకరించిన చంద్రబాబు, ఆత్మవిమర్శ

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తన వైఫల్యాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అంగీకరించారు. దేశానికి సంస్కరణల సారథిని తానేనని ఆయన చెప్పుకున్నారు. అయితే వాటి ఫలితాలను పేదలకు అందించడంలో మాత్రం విఫలమయ్యానని ఆయన అంగీకరించారు. సంస్కరణలను ముందడుగు వేయించగలిగినా వాటి ఫలితాలను పేదల వరకూ తీసుకువెళ్ళడంలో తాను కూడా విఫలమయ్యానని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

దేశంలో ఆర్థిక సంస్కరణలకు నేను ఒక చిహ్నంగా నిలిచిన మాట వాస్తవమేనని, అనేక రకాల సంస్కరణలను తేవడానికి నేను కేంద్రంపై గట్టి ఒత్తిడి తెచ్చానని ఆయన అన్నారు. సెల్‌ఫోన్ల రంగం ఈ దేశంలో విస్తరించడానికి తాను తెచ్చిన ఒత్తిడే కారణమని, కానీ ఆ సంస్కరణల ఫలితాలు పేదల వరకూ చేరలేదని, వాటిని అక్కడి వరకూ తీసుకువెళ్ళడంలో నేను కూడా విఫలమయ్యానని ఆయన అన్నారు.

సంస్కరణలు మంచివేనని, కాని వాటి ఫలాలు దేశంలో అన్ని వర్గాల ప్రజలకు అందాలని, దాని కోసం ఒక ప్రత్యమ్నాయ ఆర్థిక విధానం అవసరమని ఆయన అన్నారు. దేశంలో సం స్కరణలను మొదలుపెట్టి ఇప్పటికి 20 ఏళ్ళు అయిందని, అందులోని లోపాలను మనం దిద్దుకోవడంలో తప్పులేదని, ఆ దిద్దుబాటుకు కూడా తానే నాయకత్వం వహిస్తాననిస ప్రత్యమ్నాయ ఆర్థిక విధానం కోసం జాతీయ స్థాయిలో కొన్ని పార్టీలం కలిసి కసరత్తు మొద లు పెట్టామని, ఒక పత్రం రూపొందించి దేశవ్యాప్తంగా చర్చ జరుపుతామని ఆయన అన్నారు.

English summary
TDP president N Chandrababu Naidu has accepted his failure regarding reforms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X