వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూట్యూబ్‌లో పవార్ స్లాప్ సాంగ్, కొలావేరి రిమిక్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sharad Pawar
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, ఎన్సీపి అధినేత శరద్ పవార్ స్లాప్ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో అందరినీ అలరిస్తోంది. ఐదు రోజుల క్రితం హర్వీందర్ సింగ్ అనే యువకుడు దేశంలో ధరల పెరుగుదలను నిరసిస్తూ పవార్ చెంప చెళ్లుమనిపించిన విషయం తెలిసిందే. ఈ స్లాపింగ్ సంఘటనను సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ సినిమాలోని వై దిస్ కొలావేరి డి అనే పాటతో రిమిక్స్ చేశారు. కొలావేరి పాట ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ పాటను తీసుకొని హర్వీందర్ - పవార్ చెంపదెబ్బ వీడియోను అమర్చారు.

వీడియోలో పవార్‌ను కొట్టిన తర్వాత హర్వీందర్ తాను ఎందుకు కొట్టానో పాట రూపంలో కొలావేరి రిమిక్స్‌లో వినిపిస్తాడు. పవార్ పై అటాక్ చేసిన వీడియోలో హర్వీందర్ పెదాలు పాటకు అనుగుణంగా కదిలేలా లిప్ మూమెంట్ పెట్టారు. ఈ వీడియోను నాలుగు రోజుల క్రితం అప్ లోడ్ చేశారు. ఇప్పటి వరకు దీనికి ఏడు లక్షల హిట్స్ దాటాయి. కేంద్ర మంత్రి చెంపపై కొట్టడం, కొలావేరి సినిమా పాట హిట్ కావడం ఈ రెండూ కలిసి రావటంతో వీడియోకు చాలా రెస్పాన్స్ వస్తోంది.

English summary
Sharad Pawar getting slapped remixed with Harvinder Singh's song. After the success of Dhanush's Tamil song "Why this Kolaveri di" Harvinder Singh has come out with his own anti corruption song and tells why he slapped Sharad Pawar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X