హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారి కోసమే రచ్చబండ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: సంక్షేమ ఫలాలు అందనివారికోసమే రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మహిళలకు, యువతకూ ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం అనేక రకాల పథకాలను ప్రవేశపెడుతున్నదని ఆయన వివరించారు. శేర్‌లింగంపల్లిలో ఏర్పాటైన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మంగళవారం ప్రసంగించారు. డిసెంబర్ నెలాఖరుకల్లా 1.16 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. ప్రపంచంలో ఇప్పుడు పోటీతత్వం పెరిగిందని, చదువులోగాని, నైపుణ్యంలో గాని మనమే ముందు ఉండే విధంగా యువతలో ప్రజ్ఞాపాటవాలు పెంపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు. యువతలో లోపాలను కనిపెట్టి ప్రజ్ఞాపాటవాలు పెంచే కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

రానున్న మూడేళ్లలో 15 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన వెల్లడించారు. ఉద్యోగ జాతర ద్వారా అర్హత, ప్రతిభ ఉన్నవారికి సిఫార్సు అక్కర్లేకుండా ఉద్యోగాలు కల్పించే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు. 27 లక్షల విద్యార్థులకు రూ. 350 కోట్లతో స్కాలర్‌షిప్పులు ఇస్తున్నామని, పాత బకాయిలు కూడా తీర్చేస్తున్నామని ఆయన చెప్పారు. రైతులకు లక్షవరకూ వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు. మహిళల్లో ఆర్థిక సాధికారత పెరిగిందని,త ఇంట్లో మహిళలే ఆర్థిక మంత్రులని ఆయన అన్నారు. మహిళలు దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే రుణాలు ఇస్తారని చెబుతూ పెన్షన్ కావాలన్నా, ఆరోగ్య శ్రీ కావాలన్నా, మరి ఏ ఇతర సౌకర్యం కావాలన్నా రేషన్ కార్డులు ఉండాలని, అందుకే ప్రభుత్వం రేషన్ కార్డుల జారీపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నదని ఆయన వివరించారు. ప్రతి మండలంలో రూ. 25 లక్షలతో స్త్రీ శక్తి భవన్ ఏర్పాటుకు మార్గం సుగమం చేసినట్టు కూడా ముఖ్యమంత్రి వెల్లడించారు.

English summary
CM Kiran Kumar Reddy has announced that Rachabanda is for those people, who have not got the benefits of welfare schemes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X