హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'నీట్'పై హైకోర్టు స్టే రాష్ట్ర విద్యార్థులకు శుభవార్త: డిఎల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
హైదరాబాద్: నీట్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు స్టే విధించడం రాష్ట్ర విద్యార్థులకు శుభవార్తేనని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి బుధవారం అన్నారు. హైకోర్టు స్టేపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. వాయిదా అంశం కేంద్ర పరిశీలనలో ఉండగానే కోర్టు ఉత్తర్వులు అందరికీ ఆనందం కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు ఇక ఏ గందరగోళం లేకుండా నిర్భయంగా ఎంసెట్‌కు సిద్ధం కావచ్చునన్నారు.

కాగా అంతకుముందు నీట్ నిర్వహణపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఐఎంఏ నేత అప్పారావు, మరో ఇతర నలుగురు నీట్ పరీక్ష వాయిదా వేయాలంటూ పిటిషన్ వేశారు. బుధవారం వారి పిటిషన్లు విచారించిన కోర్టు పరీక్షపై స్టే విధించింది. ఇప్పటికిప్పుడు నీట్ పరీక్ష అంటే రాష్ట్ర విద్యార్థులు తీవ్రంగా నష్ట పోవాల్సి ఉంటుందని పిటిషన్‌దారులు కోర్టుకు విన్నవించుకున్నారు. కాగా నీట్ పరీక్షను రెండేళ్ల వరకు వాయిదా వేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. ఇప్పటికే తమిళనాడు, కర్నాటకలో ఈ పరీక్ష నిర్వహణపై స్టే ఉంది.

English summary
Minister DL Ravindra Reddy said High Court stay on NEET entrance is very happy news to state students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X