హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై తెరాసకు కాంగ్రెసు ఎమ్మెల్యేల కౌంటర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: శానససభలో తెలంగాణపై అనుసరించే వ్యూహంపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శానససభ్యులు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులను కౌంటర్ చేసే విధంగా వ్యూహాన్ని రచించి, అమలు చేయాలనేది వారి ప్రయత్నంగా కనిపిస్తోంది. రేపు సభ సమావేశం కాగానే తెరాస శాసనసభ్యులు తెలంగాణపై చర్చించి, తీర్మానం చేయాలని పట్టుబట్టే అవకాశం ఉంది. ఈ స్థితిలో ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా తాము తెరాసకు వెనకబడిపోలేదని చెప్పుకునే విధంగా సభలో వ్యవహరించాలని వారు అనుకుంటున్నారు. దీనిపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు గురువారం సమావేశమై చర్చించారు.

సమావేశం తర్వాత వారు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి తెలంగాణపై చర్చకు అవకాశం ఇవ్వాలని కోరాలని అనుకున్నారు. అయితే, స్పీకర్ అందుబాటులో లేరు. దీంతో వారు రేపు శుక్రవారం ఉదయం స్పీకర్‌ను కలిసే అవకాశం ఉంది. తెలంగాణపై స్పీకర్ సభలో చర్చకు అనుమతిస్తే దాన్ని సాకుగా చూపి తెరాస సభ్యులను శాంతింపజేయవచ్చుననేది కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల వ్యూహంగా కనిపిస్తోంది. అయితే, తెలంగాణపై చర్చకు స్పీకర్ అనుమతి ఇస్తారా అనేది అనుమానమే. కాగా, తెలుగుదేశం పార్టీ సభ్యులు ప్రధానంగా ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపైనే దృష్టి కేంద్రీకరించారు.

తెలంగాణపై చర్చకు అనుమతి ఇవ్వాలని తాము స్పీకర్‌ను కోరుతామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి చెప్పారు. తెలంగాణను కరవు ప్రాంతంగా ప్రకటించాలని, రైతులకు వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ ఎక్కువ అందించాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.

English summary
Congress Telangana region MLAs each decided to counter TRS MLAs in Assembly on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X