వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వర్ధమాన నటిని కత్తితో పొడిచిన మాజీ ప్రేమికుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sowmya Gowda
బెంగళూరు: ఓ వర్ధమాన కన్నడ నటి మాజీ ప్రియుడి చేతిలో కత్తిపోట్లకు గురైంది. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. కర్ణాటక రాజధాని బెంగళూర్‌లోని యెలహంకాలో గల జ్యుడిషియల్ లేఅవుట్‌లోని నివాసంలో మాజీ ప్రేమికుడు ఆమెను కత్తితో పొడిచి హత్యయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తీవ్రంగా గాయపడిన 23 ఏళ్ల సౌమ్య గౌడను హెబ్బాల్‌లోని బాప్టిస్టు ఆస్పత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

నిందితుడు 27 ఏళ్ల అనిల్ కుమార్ ఎంజి కొడగు సాయుధ రిజర్వ్ కానిస్టేబుల్ డిస్మిస్ అయ్యాడు. అతను కుశాల్‌నగర్‌కు చెందినవాడు. ప్రియురాలిని కత్తితో పొడిచి ఆ తర్వాత తనను తాను పొడుచుకుని ఆత్మహత్యా యత్నానికి దిగాడు. సౌమ్య గౌడ ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వం వహించిన హిందుగ హిందుగి చిత్రం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించింది. మరో నాలుగు చిత్రాల్లో కూడా నటించింది. అవన్నీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. అనిల్‌తో ఆమె సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. అయితే, అతనికి అప్పటికే పెళ్లయిందని తెలియడంతో దూరమైంది.

English summary
A small-time Kannada film actress was stabbed repeatedly by her former lover in their residence at Judicial Layout near Yelahanka on Tuesday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X