హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు షాక్ మీద షాక్, ముగ్గురు ఎమ్మెల్యేలు వెనక్కి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు శానససభ్యులు షాక్ మీద షాక్ ఇస్తున్నారు. తాజాగా, మరో ముగ్గురు శానససభ్యులు జగన్‌కు టాటా చెప్పేసి కాంగ్రెసులోకి తిరిగి రావడానికి నిర్ణయించుకున్నారు. వీరిలో కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, పాణ్యం శాసనసభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేయగా, తాజాగా ఎమ్మిగనూరు శాసనసభ్యుడు కె. చెన్నకేశవ రెడ్డి కూడా కాంగ్రెసులోకి తిరిగి రావడానికి నిర్ణయించుకున్నారు. జయసుధ, శేషా రెడ్డి ఇప్పటికే కాంగ్రెసులోకి తిరిగి వచ్చారు. ఖమ్మం జిల్లాకు చెందిన కుంజా సత్యవతి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొర్ల భారతి కూడా వెనక్కి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.

పార్టీని నియోజకవర్గాల్లో పటిష్టం చేయడంపై జగన్ దృష్టి పెట్టడం లేదని, పార్టీలో సమన్వయం లేదని, ప్రణాళిక కూడా లేదని కొంత మంది జగన్ పార్టీ నాయకులు అంటున్నారు. ఈ స్థితిలో వైయస్ జగన్ వెంట నడుస్తున్న శాసనసభ్యుల్లో తీవ్రమైన అయోమయం చోటు చేసుకుందని చెబుతున్నారు. తమ భవిష్యత్తుపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయని అంటున్నారు. నవంబర్ 24వ తేదీన జరిగిన జగన్ వర్గం సమావేశానికి 21 మంది శాసనసభ్యులు హాజరు కాగా, ఆ సంఖ్య ఇప్పుడు 15కు పడిపోయిందని చెబుతున్నారు.

జగన్ వర్గం శాసనసభ్యులను తిరిగి తమ వైపు తిప్పుకోవడానికి దొరికే ఏ అవకాశాన్ని కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వదులుకోవడం లేదు. జిల్లా పర్యటనలు చేస్తూ జగన్ వర్గం శాసనసభ్యులతో ఆయన చర్చిస్తున్నారు. నియోజకవర్గాల్లో వారు అడిగిన పనులను మంజూరు చేయడానికి సిద్ధపడుతున్నారు. దీంతో నియోజకవర్గాల అభివృద్ధి పేరు చెప్పి శాసనసభ్యులు తిరిగి కాంగ్రెసులోకి వస్తున్నారు.

English summary
In yet another blow to YSR Congress president YS Jagan, three MLAs have decided to switch loyalties to Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X