హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి లీజులపై సబితా ఇంద్రారెడ్డిని ఇరికిస్తున్న శ్రీలక్ష్మి

By Pratap
|
Google Oneindia TeluguNews

Srilaxmi
హైదరాబాద్: తాను చేసింది తప్పయితే అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆ తప్పును తన చేత చేయించారని, సబితా ఇంద్రా రెడ్డి ఆమోదంతోనే అంతా జరిగిందని గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన ఐఎఎస్ అధికారి లక్ష్మి అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి కేసులోకి సబితా ఇంద్రారెడ్డిని కూడా ఆమె లాగుతున్నారు. శ్రీలక్ష్మిని సిబిఐ అధికారులు బుధవారం కూడా విచారించారు. తప్పు జరిగి ఉంటే అది పైస్థాయిలో ఉన్న సబితా ఇంద్రారెడ్డి వల్ల, కింది స్థాయిలో ఉన్న ఐఎఎస్ అధికారి రాజగోపాల్ వల్లనే అని సిబిఐ అధికారులతో అన్నట్లు సమాచారం. అయితే, ఆమె వారిద్దరి పేర్లను నేరుగా ప్రస్తావించలేదని తెలుస్తోంది. తాను కోర్టులో పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌లో శ్రీలక్ష్మి వాంగ్మూలం ఇచ్చినంత పని చేశారు.

తాను పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టక ముందే ఆ గనులను ఓఎంసీకి కేటాయించారని తెలిపారు. "నేను 2006 మే 17వ తేదీన పరిశ్రమలు, గనులశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాను. రాష్ట్ర ప్రభుత్వం 2005 నవంబర్ 4వ తేదీనే ఓఎంసీకి లీజు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని ఓఎంసీకి లేఖ ద్వారా తెలియజేసింది'' అని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 'షార్ట్ లిస్ట్' చేసిన దరఖాస్తులను పంపించానని తెలిపారు. ఆ జాబితా కూడా తాను తయారు చేయలేదని, రాజగోపాల్ పంపిన దరఖాస్తుదారుల పేర్లనే తాను ప్రాసెస్ చేశానని వివరించారు. లీజులు ఆమోదించి, షరతులు విధించాల్సింది కేంద్ర ప్రభుత్వమే అని తెలిపారు.

'నాపై వచ్చిన ఆరోపణలన్నీ 151, 152 జీవోలకు సంబంధించినవే. అప్పటికే ప్రభుత్వం ఆమోదించిన చేసిన ఫైళ్లపైనే నేను జీవోలు జారీ చేశాను. అప్పటి గనుల శాఖ మంత్రి సబిత వద్దకు ఫైళ్లు పంపి, ఆమె ఆమోదించిన తర్వాత, ఆమె ఆదేశాల మేరకే జీవోలు జారీ చేశాను. కార్యదర్శిగా నా పేరిట జీవోలు జారీ అయినప్పటికీ... ముసాయిదా జీవోలపైగానీ, జీవోలపైగానీ నా సంతకాలు ఎక్కడా లేవు'' అని శ్రీలక్ష్మి నాటి వివరాలను పూసగుచ్చినట్లు వివరించారు.

English summary
IAS officer Srilakshmi has blamed Home minister Sabitha Indra Reddy in mining leases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X