హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమావేశానికి 13 మంది జగన్ వర్గం ఎమ్మెల్యేలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Pilli Subhash Chandrabose
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించే అవిశ్వాసంపై చర్చించేందుకు ఏర్పాటైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గం సమావేశానికి 13 మంది శానససభ్యులు మాత్రమే హాజరయ్యారు. అందుబాటులో ఉన్న పది మంది శాసనసభ్యులం సమావేశమయ్యామని మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, అమర్నాథ్ రెడ్డి, గొల్ల బాబూరావు, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, శివప్రసాద్ రెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి సమావేశానికి హాజరైనవారిలో ఉన్నారు. హైదరాబాదులోని గచ్చిబౌలిలో గల పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి నివాసంలో వీరంతా సమావేశమయ్యారు. మొదట పది మందే ఉన్నపప్పటికీ ఆ తర్వాత మరో ముగ్గురు వచ్చి చేరారు. దీంతో సమావేశానికి వచ్చిన శాసనసభ్యుల సంఖ్య 13కు చేరింది.

సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులతో వైయస్ జగన్ ఎప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడుతూ వచ్చారు. చివరకు అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని శాసనసభ్యులు సమావేశంలో నిర్ణయించారు. రైతు సమస్యలపై అవిశ్వాసం ప్రతిపాదిస్తున్నందున తాము మద్దతు ఇస్తున్నట్లు సమావేశానంతరం పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. జగన్ తమకు అదే మాట చెప్పారని ఆయన అన్నారు. ఒకరిద్దరు తప్ప మిగతా శాసనసభ్యులంతా జగన్ వెంటే ఉంటారని ఆయన చెప్పారు. అయితే ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం తమకు లేదని ఆయన అన్నారు. అవిశ్వాసానికి మద్దతుగా 22 మంది జగన్ వర్గం శాసనసభ్యులు ఓటేస్తారని ఆయన చెప్పారు. జగన్ నిర్ణయానికి కట్టుబడే శాసనసభ్యుల్లో శోభా నాగిరెడ్డి కూడా ఉండే అవకాశం ఉంది. ఓటింగ్ జరిగే నాటికి అంత మంది జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా, లేదా అనేది అనుమానంగానే ఉంది. ఆరుగురు మాత్రం జగన్ మాటకు కట్టుబడి ఉంటారనేది స్పష్టంగా తెలుస్తోంది.

English summary
Ten Jagan camp MLAs met and decided support NO - confidence motion proposed by TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X