గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓదార్పులో జగన్‌కు అవమానం, యువనేతపై కోడిగుడ్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి బుధవారం రాత్రి గుంటూరు జిల్లాలోని ఓదార్పు యాత్రలో పరాభవం ఎదురైంది. ఓదార్పులో భాగంగా జగన్ రాత్రి పది గంటల సమయంలో వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంలోని రాజీవ్ గాంధీ సెంటర్‌లో వేదిక పైనుండి ప్రసంగిస్తున్నారు. ఆ సమయంలో పక్కనే ఉన్న డాబాపై నుండి కొంతమంది యువకులు ఆయనపై కోడిగుడ్లు విసిరారు. అందులో కొన్ని జగన్‌కు తగిలాయి. తనపై కోడిగుడ్లతో దాడి జరగడంతో నివ్వెరపోయిన జగన్ వేదిక పైనుండి దిగిపోయారు. అక్కడ రసాభాసగా మారింది.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకు రావడానికి లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. అయితే పోలీసుల తీరుపై కొందరు ధ్వజమెత్తారు. కోడిగుడ్లు విసిరిన వారిని కాకుండా అమాయకులను చితకబాదారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి జగన్ అక్కడే బస చేశారు. ఇది తెలిసిన పోలీసుల లాఠీఛార్జ్ బాధితులు ఆయన బస చేసిన ఇంటి వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు.

English summary
Youngsters thrown eggs at YSR Congress Party chief YS Jaganmohan Reddy in his odarpu yatra in Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X