హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఎలా వదిలేస్తారు?: గాలి

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali muddukrishnama Naidu
హైదరాబాద్: మైనింగ్ మాఫియాతో వైఎస్ రాజశేఖర రెడ్డికి, ప్రస్తుత హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సంబంధాలుఉన్నాయని తాము ఎప్పుడో చెప్పామని, ఓఎంసీ అక్రమాల్లో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి సంబంధంలేదని సిబిఐ చెప్పడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. ఫైళ్లపై మంత్రి సబిత సంతకం చేశారా లేదా అన్నది నిగ్గు తేల్చాలని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఒఎంసి కేసులో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మిని అరెస్టు చేసి, సబితా ఇంద్రారెడ్డిని వదిలేస్తారా అని ఆయన అడిగారు.

సీబీఐ కేంద్రం ఆధీనంలో ఉందని, సోనియా, ప్రధాని చెప్తే చేసే విధంగా ఈ వ్యవస్థ తయారైందని ఆయన అన్నారు. ఎమ్మార్, వోక్స్‌వాగన్, ఓఎంసీలో ఉన్న అందరిని సంపూర్ణంగా సీబీఐ విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడు కేవిపి రామచందర్ రావుపై ఆయన మండిపడ్డారు. ఈ అవినీతి అంతా కేవీపీ కనుసన్నల్లో జరిగిందని ఆరోపించారు. అయినా కెవిపిని సీబీఐ ఎందుకు ప్రశ్నించడంలేదని ఆయన ప్రశ్నించారు. కెవిపిని ఆయన అవినీతి కింగ్‌గా అభివర్ణించారు.

English summary
TDP leader Gali Muddukrishnama Naidu has questioned CBI not arresting minister Sabitha Indra Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X