గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు కుట్ర, అయినా అవిశ్వాసానికి మద్దతు: జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు: కాంగ్రెసుతో కుమ్మక్కయి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం వెనక కుట్ర ఉందని, అయినా తాము మద్దతిస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు. చంద్రబాబు ఏది చేసినా రాజకీయంగానే ఆలోచిస్తారని, చంద్రబాబు రాజకీయాలు తప్ప రమో అలోచన చేయరని, చంద్రబాబు ఆలోచన ఏదైనా సరే తాము మాత్రం విలువలకు, విశ్వసనీయతకు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నామని, వాటికి లోబడి అవిశ్వాస తీర్మానానికి ఓటు వేస్తామని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో ఆయన గురువారం రాత్రి ఆయన ఆ విధంగా అన్నారు.

తమ శాసనసభ్యులపై అనర్హత వేటు పడినా ఫరవా లేదని ,తనతో నడిచే ప్రతి శాసనసభ్యుడు ఉప ఎన్నికలతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడని ఆయన అన్నారు. మనకు రాజకీయాల్లో కావాల్సింది విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం తెలిసిన వ్యక్తులేననిి, తెలుసుకున్న వ్యక్తులేనని, వారే రాజకీయాల్లో ఉండాలన్న నిజం ఉప ఎన్నికల్లో ప్రతి రైతు ద్వారా ప్రతి పేదవాడి ద్వారా హైదరాబాద్ గల్లీ నుంచి ఢిల్లీ ఖిల్లా దాకా వినపడేలా తెలుగుదేశం, కాంగ్రెసువాళ్లకు అర్థమయ్యేలా చేస్తామని ఆయన అన్నారు.

ఇంతకాలం అవిశ్వాసం పెట్టని చంద్రబాబు ఇవాళ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతానని అనడానికి కారణం రైతుల మీద ప్రేమో, పేదవాడి మీద ప్రేమో కాదని, జగన్ తరఫు శాసనసభ్యులు అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటేస్తే వాళ్లందరూ డిస్‌క్వాలిఫై అయిపోయి వారి పదవులు పోవాలన్న రాజకీయ కుతంత్రమని ఆయన అన్నారు. కాంగ్రెసు వాళ్లు తనకున్న కొద్దిపాటి శాసనసభ్యులను కూడా ప్రలోభపెట్టో, భయపెట్టో తన దగ్గరున్న బలాన్ని తగ్గించే కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. అయినా తాము అవిశ్వాసానికి మద్దతిస్తామని ఆయన అన్నారు.

English summary
YSR Congress president YS Jagan said that his MLAs will support No - confidence motion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X