హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ మాటే 21 మంది బాట, అవిశ్వాసానికే ఓటు: పిల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Pilli Subhash chandra Bose
హైదరాబాద్: తాము 21 మంది శానససభ్యులం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మాటకు కట్టుబడి నడుచుకుంటారని శానససభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. వైయస్ జగన్‌తో సమావేశానంతరం ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రైతు సమస్యలపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు కాబట్టి దానికి మద్దతివ్వాలని జగన్ చెప్పారని, తామంతా అందుకు అనుగుణంగానే నడుచుకుంటామని ఆయన చెప్పారు. వైయస్ జగన్‌తో జరిగిన సమావేశానికి 22 మంది శానససభ్యులు హాజరు కాగా, కాటసాని రాంభూపాల్ రెడ్డి వారితో కలిసి నడవడానికి సిద్ధంగా లేనట్లు సమాచారం. ఆయన జగన్‌తో మాట్లాడిన తర్వాత వెనక గేటు నుంచి నేరుగా కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) కార్యాలయానికి వెళ్లిపోయారు. తన నిర్ణయాన్ని రేపు చెప్తానని, జగన్ వర్గం శానససభ్యులు అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తారని ఆయన చెప్పారు.

అవిశ్వాసం ఎవరు పెట్టారన్నది ముఖ్యం కాదని, రైతు సమస్యలపై ప్రతిపాదించారు కాబట్టి మద్దతివ్వాలని జగన్ చెప్పారని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. తమ మధ్య విభేదాలు లేవని, తామంతా ఒకే మాటకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని ఆయన విమర్శించారు. కాగా, కొండా సురేఖ ఈ సమావేశానికి రాలేదు. అయితే, ఆమె భర్త, ఎమ్మెల్సీ కొండా మురళి సమావేశానికి వచ్చారు. దీన్నిబట్టి కొండా సురేఖ కూడా జగన్ వెంటే ఉండవచ్చునని అంటున్నారు. కానీ, సురేఖ జగన్ ఫోన్ చేసినా పలకలేదని ఓ ప్రముఖ టీవీ చానెల్‌లో వార్త వచ్చింది. అవిశ్వాసానికి మద్దతిస్తామని, దానివల్ల సంభవించే తదుపరి పరిణామాలను ఎదుర్కోవాడనికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు.

English summary
YS Jagan camp MLA Pilli Subhash chandra Bose said that 21 MLAs are committed to support No-Confidence Motion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X