హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సూర్య డైలీ అధినేతకు జైలులో 'బి' క్లాస్ వసతులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nookarapu Suryaprakash
హైదరాబాద్: తప్పుడు, ఫోర్జరీ పత్రాలతో విజయబ్యాంకును మోసం చేసి రుణం పొందిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు, సూర్య దినపత్రిక అధినేత నూకారపు సూర్యప్రకాష్‌కు బి క్లాస్ సౌకర్యాలు కల్పించాలని సిబిఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం హైదరాబాదులోని చంచల్‌గుడా జైలు సూపరింటిండెంట్‌ను ఆదేశించింది. ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది ఎ. చంద్రశేఖర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు శుక్రవారం మరోసారి విచారించింది. సూర్యప్రకాష్‌కు గతంలో నేర చరిత్ర లేదని, కాబట్టి ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా అధికారులను ఆదేశించాలని కోరారు.

శిక్ష పడిన మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతస్థాయి అధికారులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. వీరితో పాటు అత్యధిక ఆదాయం పన్ను చెల్లించేవారు, వ్యాపారవేత్తలు కూడా ఈ సౌకర్యాలకు అర్హులే. అయితే ఇందుకు కోర్టు ఆదేశాలు తప్పనిసరి. కిచెన్‌తో కూడిన ప్రత్యేక గది, మంచం, పరుపు, కుర్చీ, టేబుల్ ఇస్తారు. వంట మనిషిని నియమిస్తారు. దినపత్రికలు, పుస్తకాలు ఇస్తారు. కోరితే రోజూ మాంసాహారం ఇస్తారు. బయటి నుంచి తెచ్చుకున్న పదార్థాలతో ఇష్టమైన ఆహారాన్ని గదిలో వండించుకోవచ్చు.

English summary
Court has ordered for additional facilities to Surya daily editor Nookarapu Suryaprakash under 'B' class prisoner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X