ప్లీజ్! కష్టకాలంలో ఆదుకోండి: చిరంజీవికి పటేల్ ఫోన్

ఇన్నాళ్లూ రాష్ట్రంలో ప్రభుత్వానికి అండగా ఉంటామని చెబుతూ వస్తున్న చిరంజీవి అండ్ గ్రూప్ అసంతృప్తికి గురి కావడంతో నేరుగా హైమాండ్ రంగంలోకి దిగింది. చిరుకు, ఎమ్మెల్యేలకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చింది. జగన్ వర్గం ఎమ్మెల్యేలపై కూడా అధిష్టానం కరుణరసం కురిపించిన విషయం తెలిసిందే. కాగా సాయంత్రం పిఆర్పీ ఎమ్మెల్యేలు మరోసారి భేటీ అయి విప్ జారీ చేసే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారన్న టిడిపి ఆరోపణలు అవాస్తవమని మేడ్చల్ ఎమ్మెల్యే కెఎల్ఆర్(కె లక్ష్మా రెడ్డి) కొట్టి పారేశారు. టిడిపి అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ అంశాన్ని అధిష్టానం పరిష్కరిస్తుందన్న నమ్మకం తమకుందన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఎవరూ చేయరన్నారు.












Click it and Unblock the Notifications