వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఎమ్మెల్యేలే మా వద్దకు వస్తారు: చిరు ఎమ్మెల్యే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ganta Srinivas Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులే తమ వద్దకు వస్తారని చిరంజీవి వర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు ఆదివారం మీడియాతో చెప్పారు. విప్‌కు సంబంధించిన చిరంజీవి నివాసంలో భేటీ పూర్తయిన తర్వాత ఆయన మాట్లాడారు. తాము పదవుల కోసం భేటీ కాలేదని పార్టీలో ఆత్మగౌరవం కావాలనే భేటీ అయినట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఎవరికీ విప్ జారీ చేయలేదని చెప్పారు. సాయంత్రం మరోసారి భేటీ అయిన తర్వాత క్లారిటీ వస్తుందని ఆ తర్వాత విప్ జారీ చేస్తామని చెప్పారు. భేటీకి హాజరైన పదహారు మంది ఎమ్మెల్యేలం చిరంజీవి ఏది చెబితే అదే వింటామని చెప్పారు.

తమ వెనుక పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ఉన్నారన్న వాదనను ఆయన కొట్టి పారేశారు. కిరణ్‌పైకి ఆయన మమ్మల్ని ఎందుకు ఉసిగొల్పుతారని అన్నారు. జగన్ ఎమ్మెల్యేలే తమ వద్దకు వస్తారని చెప్పారు. బొత్స, సిఎం కిరణ్, గులాం నబీ ఆజాద్ నుండి మాకు మరింత స్పష్టత కావాలన్నారు. చిరుకు ఆజాద్ పలుమార్లు ఫోన్ చేసి హామీ ఇచ్చినట్లు చెప్పారు. కాగా చిరంజీవికి ఆజాద్ మరోసారి ఫోన్ చేసి హామీ ఇచ్చారు.

English summary
Chiranjeevi camp mla Ganta Srinivas Rao said today that YSR Congress Party chief YS Jaganmohan Reddy camp mlas come along with prp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X