వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు: జగన్,టిఆర్ఎస్‌పై టిడిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mothkupalli Narsimhulu and Devineni Umamaheshwara Rao
హైదరాబాద్: తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన తర్వాత కోట్లాది రూపాయలు ఇతర పార్టీల మధ్య చేతులు మారాయని తెలుగుదేశం పార్టీ ఆదివారం ఆరోపించింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాక భారీగా డబ్బులు చేతులు మారాయని కృష్ణా జిల్లా సీనియర్ శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. జగన్ వర్గానికి చెందిన సగం మంది ఎమ్మెల్యేలు ఇందులో భాగంగానే ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. తాను కన్నెర్ర చేస్తే ప్రభుత్వం కూలిపోతుందన్న జగన్ ఇప్పుడు ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. అవిశ్వాసం పట్ల తన వైఖరి, బలమేమిటో జగన్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

అవిశ్వాసం తర్వాత టిఆర్ఎస్, జగన్ వర్గం ఎమ్మెల్యేలు తమ తమ అకౌంట్లు సెటిల్ చేసుకుంటున్నారని మరో ఎమ్మెల్యే లింగా రెడ్డి అన్నారు. ఆ ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలకంటే సొంత లాభాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. అవిశ్వాసంతో ఎవరేంటో తేలిపోతుందని ప్రభుత్వాన్ని కాపాడుతుందెవరో కూల్చేదెవరో ప్రజలకు అర్థమవుతుందన్నారు. పదవులు, కుర్చీ కాపాడుకోవడం కోసం పార్టీలు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాయని ఎర్రన్నాయుడు విమర్శించారు.

English summary
TDP mlas Devineni Umamaheshwar Rao and Mothkupalli Narsimhulu blamed YS Jagan and TRS mlas for their attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X