హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మేయర్ పదవికి బండ కార్తిక రెడ్డి రాజీనామా

By Pratap
|
Google Oneindia TeluguNews

Karthika Reddy
హైదరాబాద్: హైదరాబాద్ మేయర్ పదవికి కాంగ్రెసుకు చెందిన బండ కార్తిక రెడ్డి రాజీనామా చేశారు. మజ్లీస్ పార్టీకి మేయర్ పదవి అప్పగించడానికి వెసులుబాటు కల్పిస్తూ ఆమె సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. హైదరాబాద్ మేయర్ పదవిని కాంగ్రెసు మొదటి రెండేళ్లు, చివరి ఏడాది చేపట్టడానికి, మిగతా రెండేళ్లు మజ్లీస్ చేపట్టడానికి వీలుగా రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. కాంగ్రెసుకు చెందిన బండ కార్తిక రెడ్డి మేయర్ పదవి చేపట్టి రెండేళ్లు పూర్తి కావడంతో రాజీనామా చేశారు. మేయర్ పదవిని ఇక మజ్లీస్ పార్టీకి చేపడుతుంది.

మేయర్ పదవి విషయంలో గత కొద్ది రోజులుగా మజ్లీస్‌కు, కాంగ్రెసుకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. రాజీనామా చేయడానికి తొలుత కార్తిక రెడ్డి కొంత మొరాయించారు. పదవిలో కొనసాగడానికి చేయాల్సిన ప్రయత్నాలు చేసింది. అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం కొనసాగడానికి మజ్లీస్ శాసనసభ్యుల మద్దతు అవసరం కావడంతో సంబంధాలు బెడిసికొట్టకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో వారు కార్తిక రెడ్డి చేత రాజీనామా చేయించడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కార్తిక రెడ్డి, నగర శానససభ్యులు, మంత్రుల సమక్షంలో మేయర్ పదవిని మజ్లీస్‌కు అప్పగించనున్నట్లు బొత్స సత్యనారాయణ ఇప్పటికే ప్రకటన చేశారు. ఈ నెల 17వ తేదీన జరిగే కౌన్సిల్ సమావేశంలో కొత్త మేయరు ఎన్నిక జరుగుతుంది.

English summary
Hyderabad mayor Banda Karthika Reddy resigned from her post today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X