వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఎమ్మెల్యేలు మాజీలౌతారు:గండ్ర,టిఆర్ఎస్‌కు ప్రశ్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

gandra venkata ramana reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తే వారు మాజీలు అవుతారని కాంగ్రెసు ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోతే తెలంగాణ ఎలా వస్తుందో చెప్పాలని ఆయన టిఆర్ఎస్‌ను ప్రశ్నించారు. తెలంగాణ తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమే అన్నారు. త్వరలో తెలంగాణ అంశాన్ని పార్టీ అధిష్టానం తేల్చుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ప్రాంత శాసనసభ్యులకు ప్రత్యేక రాష్ట్రంపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా టిడిపి ప్రవేశ పెట్టిన అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయాలని టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. కిరణ్ ప్రభుత్వం కూలిపోతేనే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. చిరంజీవి, ఎంఐఎం అవిశ్వాసం అదను చూసుకొని తమ డిమాండ్లు నెరవేర్చుకున్నారని ఇప్పుడు టి-కాంగ్రెసు పట్టుబడితే తెలంగాణపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

English summary
Congress MLA Gandra Venkata Ramana Reddy said today that YSR Congress Party chief YS Jaganmohan Reddy camp MLAs will loose their posts if support TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X