వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ కాదు కాంగ్రెస్ సర్కార్, వ్యతిరేకంకాదు: కోమటిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

komatireddy venkat reddy
హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నది కిరణ్ కుమార్ రెడ్డి సర్కారని తాను భావించడం లేదని కాంగ్రెసు సర్కారుగానే భావిస్తున్నానని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం అన్నారు. తాను తెలంగాణ, కాంగ్రెసువాదినని ఆయన చెప్పారు. పార్టీ అధిష్టానం తెలంగాణ ఇవ్వనని స్పష్టంగా చెబితే తాను పార్టీ వీడతానని అప్పటి వరకు తాను పక్కా కాంగ్రెసు వాదినని చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసే ప్రసక్తి లేదన్నారు. కాంగ్రెసులోకి సిఎం కంటే ముందు తానే వచ్చానని చెప్పారు. ఆయనకంటే ముందే ఎన్ఎస్‌యుఐలో పని చేశానన్నారు.

కాగా రామగుండం కాంగ్రెసు పార్టీ అనుబంధ శాసనసభ్యుడు సోమారపు సత్యనారాయణకు కాంగ్రెసు విప్ జారీ చేసింది. అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే తాను అనుబంధ సభ్యుడిగా తప్పుకున్నందున తనకు ఈ విప్ వర్తించదని సోమారపు చెబుతున్నారు. విప్ డోంట్ కేర్ అంటున్నారు.

English summary
Former Minister Komatireddy Venkat Reddy said today that it is not Kiran's government but Congess Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X